Thursday, April 25, 2024

ఆస్కార్ రేసులో ఊపందుకుంటున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’!

- Advertisement -
- Advertisement -
జనవరి 9న నామినేషన్ల ప్రకటన…అవార్డుల ప్రదానం ఫిబ్రవరి 19న

హైదరాబాద్: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ బరిలో గర్జిస్తోంది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్(బిఎఎఫ్‌టిఎ)లో ‘ఉత్తమ చిత్రం’(ఇంగ్లీషేతర) కేటగిరిలో ఉంది. దీంతో పాటు షౌనక్ సేన్ చిత్రం ‘ఆల్ దట్ బ్రీత్స్’ అనే సినిమా కూడా పోటీపడుతోంది. కానీ అది ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ కేటగిరిలో ఉంది. ‘బాఫ్టా ఫిలిం అవార్డుల లాంగ్ లిస్ట్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ఉన్నందుకు సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు’ అని నిర్మాతలు ఇదివరకే రాశారు. జనవరి 19న నామినేషన్లు ప్రకటిస్తారు…ఫిబ్రవరి 19న అవార్డుల ప్రదానం జరుగుతుంది.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పాటు పోటీ పడుతున్న ఇంగ్లీషేతర సినిమాలు: ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా, 1985, బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రుత్స్, క్లోజ్, కొర్సేజ్, డిసీషన్ టు లీవ్, ఈవో, హోలి స్పయిడర్, ద క్వయిట్ గర్ల్. మన తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఫుల్ ఫామ్ ‘రైజ్, రోర్, రివోల్ట్ ’అని. రాజమౌళి సినిమా తీయడానికి ముందు మాత్రం తాత్కాలికంగా రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు అని వచ్చేలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని పెట్టుకున్నారు. చివరికి అదే ఖాయం అయిపోయింది. కానీ దాని ఫుల్ ఫామ్‌ను మాత్రం పోస్టర్‌పై మార్చేశారు.

జనవరి 11న రాజమౌళి, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాస్ ఏంజెల్స్ వెళతారు. అక్కడ జనవరి 11న ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ జరుగుతాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రెండు కేటగిరిల్లో నామినేట్ అయింది. ఒకటి, ఉత్తమ విదేశీ చిత్రంలో, రెండోది, ఉత్తమ ఒరిజినల్ పాట(నాటు నాటు…) కేటగిరిలో. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం బాషల్లో ప్రపంచమంతా విడుదలయింది.

కథ విషయానికొస్తే ఈ సినిమా 1920 దశకం నాటి కల్పిత కథ. ప్రధానంగా అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ప్రేరణతో తీసింది. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. మిగతా నటీనటులు కూడా వారి వారి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అందరినీ ఆకట్టుకుంది. విదేశీయులను సైతం ఆనందింపజేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు తప్పక అవార్డు వస్తుందనే చాలా మంది అనుకుంటున్నారు. అవార్డును గెలిస్తే మాత్రం…ఇది భారత సినీ జగత్తుకే గర్వకారణం కాగలదు. ఎందుకంటే ఇప్పటి వరకు భారతీయ సినిమా ఏది ఆస్కార్ గెలుచుకోలేదు. గెలిస్తే మాత్రం… అందునా తెలుగు చిత్ర సీమకి మంచి గుర్తింపు రాగలదు. ’ఛాన్సెస్ ఆర్ బ్రైట్’ , చూద్దాం మరి…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News