Friday, March 29, 2024

ఎన్టీఆర్‌పై సీన్స్‌తో తిరిగి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా నవంబర్‌లో ప్లాన్ చేస్తోన్న తదుపరి షెడ్యుల్‌లో ఎన్టీఆర్, ఒలివియా మోరిస్‌కు మధ్య నడిచే సీన్స్ ను షూట్ చేయనున్నారట. తారక్ మీద ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయడానికి ఈ సీన్స్ లోని కొన్ని షాట్స్ అవసరం అవుతాయట. అందుకే ముందుగా ఈ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశంపైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికి ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. తారక్, ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలిసింది. డివివి ఎంటెర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆరంభం నుండి దేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR Movie shoot to resume from November

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News