Friday, April 19, 2024

ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్…. సింగర్స్ వీరే…

- Advertisement -
- Advertisement -

RRR Movie theme song released

హైదరాబాద్: పాన్ ఇండియా స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చరణ్, ఎన్‌టిఆర్ నటిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ థీమ్ సాంగ్ పేరిట ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. ఈ సాంగ్‌ను ఎవరు పాడుతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ సాంగ్‌ను పాడిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో కూడీ విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయ్, అనిరుధ్ రవిచందర్, హేమచంద్ర, ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆలపిస్తున్నారు. స్నేహం విలువ తెలిపే ఈ పాటను ఆగస్టు 1న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీంగా ఎన్‌టిఆర్ కనిపించనున్నారు. హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖనితో పాటు హాలీవుడ్ నటులు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News