Thursday, April 25, 2024

దసరాకి ‘ఆర్‌ఆర్‌ఆర్’?

- Advertisement -
- Advertisement -

Another video Ready for NTR's Fans from 'RRR'

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలీవియా మోరిస్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి విడుదలైన మోషన్ పోస్టర్స్, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అందుకే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ తర్వాత రాజమౌళి టీమ్ ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించారు.

ఈ షూట్‌లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొంటోంది. గతంలో రాజమౌళి చెప్పినట్లుగా జనవరి 8న ‘ఆర్‌ఆర్‌ఆర్’ థియేటర్లలో విడుదల కావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్ బృందం ఈ సినిమాను వచ్చే దసరాకి విడుదల చేయాలని ప్లాన్ ఉన్నారట. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రామ్‌చరణ్‌కి కరోనా పాజిటివ్ రావడం బాధాకరం. అయితే ఎలాగైనా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌ను మార్చి నెలలో పూర్తి చేసి.. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ జక్కన్న విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

RRR Movie to be released for Dussehra 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News