Saturday, April 20, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

- Advertisement -
- Advertisement -

RRR Movie Trailer postponed

హైదరాబాద్‌: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక థీయేటర్లలో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ జోరు పెంచింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 3న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్న మేకర్స్ ప్రకటించారు. అయితే, టెక్నికల్ ఇష్యూలతోపాటు నిన్న సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొనడంతో ఈ మూవీ ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ట్రైలర్‌ విడుదల తేదీని మళ్లీ ప్రకటిస్తామని తెలిపింది.

RRR Movie Trailer postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News