Friday, March 29, 2024

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ..

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను 'ఆర్ఆర్ఆర్' టీమ్ నిరాశకు గురిచేసింది.

మైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను ‘ఆర్ఆర్ఆర్‘ టీమ్ నిరాశకు గురిచేసింది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఆయన ఇంట్రో వీడియోని చిత్రయూనిట్ విడుదల చేయనున్నట్లు గత వారం రోజులుగా నెట్టింట్లో వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్పందించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, వీడియో గానీ విడుదల చేయడంలేదని ప్రకటించింది. ”తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని స్పెషల్ వీడియోని విడుదల చేయాలని భావించాం. అందుకు మేము ఎంతో కష్టపడ్డాం. అయితే, మరో సారి లాక్ డౌన్ పొడిగించడంతో పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో మేము విడుదల చేయాలనుకున్న వీడియో గ్లిమ్స్ పూర్తి కాలేదు. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే అద్భుతమైన వర్క్ ను అందిస్తాం. అది విడుదలైన రోజు మనందరికి పండగ అవుతుంది” అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్టర్ లో పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని మార్చి నెలలో విడుదల చేసిన వీడియో అద్భుతమైన స్పందన లభించింది. ఇక, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో.. జ‌న‌వరి 8న కాకుండా సమ్మ‌ర్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News