Home జాతీయ వార్తలు రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

Money

 

హర్యానా : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల తనిఖీలలో భారీగా నగదు, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కారులో తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత భారీ మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన దివేశ్ ఈ నగదును అక్రమంగా తరలిస్తూ పట్టబడ్డాడు. విధాన సభ ఎన్నికల సందర్భంగా ప్రజలను ప్రలోభ పెట్టేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. కేసు నమోదు చేశామని దివేశ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

 

Rs.1.30 crore Captured in Haryana Assembly Elections
Rs.1.30 crore Money Captured in Gurugram At HaryanaRs.1.30 crore Money Seized In Gurugram At Haryana