Home తాజా వార్తలు పట్టణ ప్రాంతాల అభివృద్దికి రూ. 145 కోట్లు: మంత్రి సబితారెడ్డి

పట్టణ ప్రాంతాల అభివృద్దికి రూ. 145 కోట్లు: మంత్రి సబితారెడ్డి

 Urban Areas

 

రంగారెడ్డి : పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాడు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆల్మాస్‌గూడ శ్రీహిల్స్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేసి కమ్యూనిటి హాల్‌ను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అబివృద్దే ద్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోని 3 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 12 మున్సిపాలిటీల సమగ్ర అభివృద్దికి రూ. 145 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అవకాశం ఉన్న ప్రతి చోట విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మున్సిపాలిటిలలో దశల వారిగా సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మూడు కోట్ల నిధులతో ఆర్‌సిఐ నుంచి చేపడుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి పనులు నాణ్యతగా త్వరిగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

బ్యాటరీ వాహనంను ప్రారంభించి స్వయంగా నడిపిన మంత్రి సబితారెడ్డి
ఆర్.కె.పురం చిత్ర లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనంను మంత్రి సబితారెడ్డి ప్రారంభించి కాలనీ మహిళలను వాహనంలో ఎక్కించుకుని వాహనంను నడిపారు. కాలుష్య రహిత కాలనీలు రూపుదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. కాలుష్య రహిత వాహనాలను వాడుతు కాలనీలో ప్రజల అవసరాల కోసం ఇలాంటి వాహనాలను వినియోగిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ మాజీ చైర్మెన్ యాతం శ్రీశైలం యాదవ్, సామ నరసింహ, రాంరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Rs 145 crore for Development of Urban Areas