Sunday, March 26, 2023

పంటలకు రూ.37 కోట్ల రాయితీ: ఎంఎల్‌ఎ

- Advertisement -

vikas

మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం టౌన్: పంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్ల రాయితీ ఇస్తుందున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులకు డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ ఎడి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల వెచించి సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై యంత్రాలు అందజేస్తుందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. డివిజన్ పరిధిలోని రైతులందరూ వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులనిచ్చే పంటలను సాగు చేసుకోవాలని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికి సాగునీరు సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని రానున్న రెండు సంవత్సరాల్లో ఎల్లమ్మతండా నుండి డిండి ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగునీరందించే పనులకు ప్రభుత్వం కార్యరూపం దాల్చిందని ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును నింపి ఈ ప్రాంత పంటలను సస్యశ్యామలం చేయడమే తమ లక్షమన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపిపిలు నిరంజన్‌రెడ్డి, జయమ్మ, జ్యోతినాయక్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షు అంజిరెడ్డి, పుల్లారెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ రవి, డైరెక్టర్లు కిషన్‌రెడ్డి, జహీర్, జగదీష్, లక్ష్మన్, వివిధ మండలాల వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News