Home జాతీయ వార్తలు వైట్‌లోట‌స్‌లో రూ.44 కోట్ల న‌గ‌దు సీజ్‌

వైట్‌లోట‌స్‌లో రూ.44 కోట్ల న‌గ‌దు సీజ్‌

White Lotusచెన్నయ్ : స్వయం ప్రకటిత కల్కిభగవాన్‌ దంపతులకు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కల్కి భగవాన్ ఆశ్రమాలు, వ్యాపార సంస్థలపై సోమవారం కూడా ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో ఉన్న క‌ల్కీ భ‌గ‌వ‌న్‌కు చెందిన వైట్ లోట‌స్ ఆస్తులపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో ఐటి అధికారులు వైట్ లోటస్ లో సుమారు 44 కోట్ల న‌గ‌దుతో పాటు సుమారు 20 కోట్ల విలువైన అమెరికా డాల‌ర్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో 90 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేసినట్టు ఐటి శాఖ అధికారులు తెలిపారు. చెన్నైతో పాటు హైద‌రాబాద్‌, బెంగుళూరు, చిత్తూరు, కుప్పం తదితర  ప్రాంతాల్లో కూడా సోమవారం ఐటీశాఖ అధికారులు దాడులు చేశారు.

Rs.44 Crores Seized In White Lotus At Chennai