Thursday, April 25, 2024

చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా

- Advertisement -
- Advertisement -

Rs 5 lakh insurance for handloom workers:KCR

 

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలో సిఎం కెసిఆర్‌ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రైతులకు రూ.5 లక్షల బీమా అందజేస్తున్నట్లుగానే, చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. రైతు బీమా మాదిరే రాబోయే రెండు మూడు నెలల్లో చేనేత కార్మికులకు కూడా బీమా ప్రకటిస్తామన్నారు. కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా, వాళ్లు ఏకదమ్‌ పరేషాన్‌ కాకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందన్నారు. చేనేత విషయంలో, మరమగ్గాల విషయంలో కూడా కొంత డబ్బును కార్పస్‌ ఫండ్‌గా పెట్టి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతుందన్నారు. అన్ని వృత్తుల మాదిరే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చర్యలను సిఎం కెసిఆర్ వివరించారు. నూలు గానీ, రసాయనాలు గానీ, రంగులు గానీ 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. అందరి మొఖాల మీద చిరునవ్వులు వికసించే తెలంగాణ కావాలని ఆ దిశగా ముందుకు పురోగమిద్దామని సిఎం కెసిఆర్ తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా చేనేత కార్మికులకు పని దొరికినట్లైందని సిఎం కెసిఆర్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News