Home తాజా వార్తలు మొక్క తిన్న మేక…. రూ.500 జరిమానా

మొక్క తిన్న మేక…. రూ.500 జరిమానా

 

 

భువనగిరి: హరితహారంలో నాటిన మొక్క తిన్న మేక యజమానికి రూ.500 జరిమానా విధించిన సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో వడాయిగూడెంలో చోటుచేసుకుంది. హరిత హారంలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా రోడ్డుకు ఇరువైపులలా మొక్కలను నాటడమే కాకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఓ కాపారి తన మేకలను చెట్ల వద్ద మేపడంతో ఆ మేకలు ఓ చెట్టు ఆకులను తినడమే కాకుండా పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో ఆ కాపారికి పంచాయతీ అధికారిణి అనురాధ ఐదు వందల రూపాయల జరిమానా విధించారు.

 

RS 500 Fine to Goat about Eat Tree in Bhongiri