Thursday, April 25, 2024

హీరో విజయ్‌ ఫైనాన్షియర్ నివాసంలో ఐటి సోదాలు.. రూ.65 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన తమిళ స్టార్ హీరో తలపతి విజయ్‌పై ఆదాయ పన్ను ఎగవేత కేసులో భాగంగా గురువారం ఆయన నివాసాల్లో ఇన్‌కం టాక్స్ అధికారులు సోదాలు నిర్వహస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తన కొత్త చిత్రం మాస్టర్ చిత్రకరణలో సందర్భంగా నైవేలిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం నైవేలీ బొగ్గు గనుల వద్ద షూటింగ్ లో ఉన్న విజయ్ వద్దకు ఆదాయం పన్ను అధికారులు వెళ్లి.. 2019, అక్టోబరులో రిలీజైన బిగిల్‌ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌పై ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ఎజిఎస్ సంస్థ కార్యాలయం, ఫిలిం ఫైనాన్షియర్ అంబు చెలియన్ నివాసంపై ఐటి అధికారులుల దాడులు జరిపారు. ఈరోజు విజయ్‌ని షూటింగ్ నుంచి చెన్నైకి పిలిపించిన ఐటి అధికారులు ఆయన నివాసంతోపాటు ఫైనాన్షియర్ నివాసంలోనూ సోదాలు చేపట్టారు. మొత్తం 38 చోట్ల పోదాలు నిర్వహించిన అధికారులు ఫైనాన్షియర్ నివాసం నుంచి రూ.65 కోట్ల నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించి విజయ్‌ను 8 గంటలుగా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఐటి అధికారులు ఇలా సడెన్ గా దాడి చేయడంపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వమే కావాలని ఈ దాడులను జరిపిస్తోందని వారు అరోపిస్తున్నారు.

Rs.65 Cr Seized by IT Officials at Thalapathy Vijay’s House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News