Friday, March 29, 2024

భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 8.40 Cr worth Marijuana Seized in Khammam

మన తెలంగాణ/కొత్తగూడెం/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకేరోజూ భారీ ఎత్తున్న గంజాయి పట్టుబడింది. చేపలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మాటునా అక్రమంగా గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు వల వేసి పట్టుకున్నారు. దాదాపు రూ8.40 కోట్ల విలువైన గంజాయిని చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేయడంతో గోదాంలో నిల్వ ఉంచిన గంజాయిని రెండు జిల్లాల పోలీసులు చకచక్యంగా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.7.30లక్షల విలువైన 3653.100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోటి పది లక్షల విలువైన 730 కిలోల స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో బృందావనం బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా చేపలతో రవాణా అవుతున్న రెండు ఐషర్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.7.30 కోట్ల విలువైన 3653.100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతూరు నుంచి కొనుగోలు చేసిన భారీ మొత్తం గంజాయిని ఒక వ్యాన్‌లో హైదరాబాద్, మరో వ్యాన్‌ను హర్యానాకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

డ్రైవర్లు వెంకటేశ్, సుభాష్, నఫీజ్, ఇమ్రాన్ ఖాన్‌లను అ రెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి మీడియాకు వివరించారు. అదేవిధంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోటి పది లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరాల ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలోని శ్రీ సీటిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువువులు, వస్త్రాలను ఊరూరా తిరిగి విక్రయించే వ్యాపారం చేసుకుంటూ తెర చాటున గంజాయిని విక్రయించే దందా కూడా చేస్తున్న ట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగఢ్‌లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌ను కొనుగోలు చేసి మార్గమధ్యలో చింతపల్లిలో పంగి నారాయణ, పింగి శివ వద్ద గంజాయినీ కొనుగోళ్లు చేసి లారీలు, ఇతర వాహనాల్లో ఖమ్మం నగరానికి గత కొంత కాలంగా తీసుకొస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ విక్రయం పేరుతో గంజాయిని కూడా విక్రయిస్తున్నారు.

బుధవారం మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమైనందున ఉన్నతాధికారుల అదేశం మేరకు ఖమ్మం రూరల్ ఎస్‌ఐ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు క్రాస్ రోడ్డులో కోటి దాబా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు డిసిఎం వ్యాన్లో, ఒక బొలెరో కారులో 136 గంజాయి ప్యాకేట్లను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆరేంపుల గ్రామంలోని శ్రీసీటిలోని గోదాంలో మరో పది గంజాయి ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం టి 9లక్షల 50వేల విలువైన 146 ప్యాకేట్లు లు)ను, రెండు ్యన్లు, రెండు బొల్లెరా రెండు స్కార్పియో కారు మొత్తం ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు ందిన ఆశూమీయన్, మహ్మద్ ఆసీప్ ఖురేషి, మహ్మద్ ఆరీఫ్ ఖురే షీ, మౌసిన్, యామీన్‌లతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన బొలెరో డ్రైవర్ మాల్లోతు పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. గంజాయిని విక్రయించిన విశాఖ పట్టణం జిల్లా చింతపల్లి గ్రామానికి దిన పంగి నారాయణ, పంగి శివలు పరారీలో ఉన్నారు.

Rs 8.40 Cr worth Marijuana Seized in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News