Friday, April 26, 2024

మత్తు చిత్తు

- Advertisement -
- Advertisement -

Rs 8 crore worth of drugs seized in one day in Telangana

రాష్ట్రంలో ఒకేరోజు రూ.8కోట్ల డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ నగరంలో రూ.5.50 కోట్ల ఎపిడ్రిన్ స్వాధీనం
మేడ్చల్,సత్తుపల్లిలో 1025 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి కట్టడికి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు

మనతెలంగాణ/సూర్యాపేట,హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖలు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ గంజాయి తరలింపును అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో గురువారం నాడు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు పోలీసులు కలిసి సంయుక్త దాడులలో రూ. 8 కోట్ల విలువ చేసే (మత్తుపదార్థాల) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈక్రమంలో హైదరాబాద్‌లో నగరంలోని నార్త్ జోన్ పరిధిలో దాదాపు 14.2 కిలోల నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను బేగంపేట పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తుమందు విలువ దాదాపు రూ.5.50 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బేగంపేటలోని ఇంటర్‌నేషనల్ కొరియర్ ఏజెన్సీలో తనిఖీలు చేపట్టగా ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి ప్యాకింగ్ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డి ఆర్‌ఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు కొరియ ర్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 22 ఫొటో ఫ్రేమ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. కొరియర్ చేసేందుకుగాను నకిలీ ఆధార్‌ను ఉపయోగించినట్లు పో లీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు దీంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామని అనతికాలంలో వారిని అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు వివరించారు.

అదేవిధంగా నగరంలో మత్తు మాత్రలు వి క్రయిస్తున్న ముగ్గురిని ఆసిఫ్ నగర్ పోలీసులు అరె స్టు చేశారు. వారి నుంచి 110 ఎండిఎంఎ టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా మత్తు మాత్రలు విక్రయిసు చరణ్, రాచర్ల అంకిత్, అజయ్ సాయిలను అరెస్ట్ చేశారు. అలాగే అశ్వారావు పేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని సత్తుపల్లి పట్టణ శివారులోని జెవిఆర్ పార్క్ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 566 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యో గేశ్ లింబాజీ, ఇర్ఫాన్ సాదర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. కాగా నిందితులు ట్రాలీ లారీ ప్లాట్‌ఫామ్ కింద భాగంలో ప్రత్యేకం గా వెల్డింగ్‌తో తయారు చేసిన గదుల్లో 566 కిలో ల గంజాయిని 250 పొట్లాలుగా పెట్టి తరలిస్తున్న ట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.40 కోట్లు ఉంటుందని వివరించారు.

కాగా ఈ కేసులో గణేష్ ఉబాడే అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసును పూ ర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని కౌకు ర్ దర్గా వద్ద గురువారం నాడు రెండు కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నా రు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని తీసుకొని కర్ణాటక, మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించిన మహ్మద్ ఫరీద్, ఇస్మాయిల్, సచిన్ చవాన్, బ స్వరాజులను అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News