Tuesday, March 21, 2023

ఎకరానికి రూ.8వేలు చరిత్రాత్మకం

- Advertisement -

trs

*ప్రజలే మా ఏజెండా..రైతే దేశానికి వెన్నెముక
*తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి
*రెండేళ్లలో విద్యుత్ అమ్మే స్థాయికి
*కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్

మనతెలంగాణ/మానకొండూర్: ఎకరానికి రూ.8వేలు ఇ వ్వడం చరిత్రాత్మకమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు.మానకొండూర్‌లోని టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జివి.రామకృష్ణారావు దేశ్‌ముఖ్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అ త్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఉద్య మ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, ప్రభుత్వం అహర్నిషలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని అ న్నారు.ప్రజలే మా ఏజెండా రైతే దేశానికి వెన్నెముక అన్నా రు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరిగానే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎకరానికి పెట్టుబడి కోసం నగదును అందించే విధంగా పార్లమెంట్‌లో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రైవేటు బిల్లును పెట్టడం జరిగిందని ఎంపి వివరించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ది క్సూచిగా మారిందని చెప్పారు. వేల కోట్లు ఖర్చుచే సి సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నామ ని,పాల్వంచలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, యా దాద్రి జిల్లా దామరచర్లలో మరో పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని వివరించారు.
ఆ పవర్ ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణలో కరెంటుకు ఎలాంటి కొరత ఉందబోదని,మరో రెండేళ్లలో మన రాష్ట్రమే పక్క రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి చేరుకుంటామని అన్నారు.గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ఎ త్తిపోతల పథకం ప్రాజెక్టు మహా అద్భుతమని, ప్రాజెక్టును చూసేందుకు జాతరలా తరలివస్తున్నారని అన్నారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృ షి చేస్తున్నట్లు తెలిపారు. మానేరువాగుపై సదాశివపల్లి వద్ద తీగల వంతెన నిర్మాణానికి నిధులు తీసుకువచ్చామని, క రీంనగర్ నుంచి ఖాజీపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం సర్వే కోసం పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. జగిత్యాల నుంచి విశాఖపట్నం వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకువచ్చినట్లు ఎంపి వివరించారు. రా ష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకు లు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు ఒకే సారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.అంటే రెండు లక్షల రూపాయల వరకు రైతులు అ ప్పులపాలు అయ్యే వరకు చూసి కాంగ్రెస్ నాయకులు మా ఫీ పేర ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంఎల్‌ఎ బాలకిషన్, ఎంపిపి మాతంగి లింగయ్య,జివి.రామకృష్ణారావు, టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్,ఊటూర్ సింగిల్ విండో చైర్మన్ ముద్దసాని ప్రదీప్‌రెడ్డి,రైతు సమన్వయ సమితి మం డల కోఆర్డినేటర్ రామంచ గోపాల్‌రెడ్డి, చెంజర్ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బోళ్ల మురళీధర్, గుర్రం కిరణ్, దండబోయిన శేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ
మండలంలోని గంగిపల్లి గ్రామంలో రూ.1కోటి 40 లక్షలతో నిర్మాణం చేపట్టే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపి వినోద్, ఎంఎల్‌ఎ బాలకిషన్, ప్రజాప్రతినిధులు భూమి పూ జ చేశారు. గంగిపల్లిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గంగిపల్లి ధనలక్ష్మి ధాన్య విత్తన రైతు పరస్పర సహకార ప రపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిపి మా తంగి లింగయ్య, గ్రామ సర్పంచ్ వాల ప్రదీప్‌రావు, రాష్ట్ర నే త జివిఆర్ దేశ్‌ముఖ్, గంగిపల్లి సొసైటీ అధ్యక్షుడు రెడ్డి స త్యనారాయణరెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్, రామంచ గోపాల్‌రెడ్డి, ఎంపిటిసి కల్వల స్వామి, రెడ్డి సంపత్‌రెడ్డి,రెడ్డి శ్రీపతిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles