Thursday, April 25, 2024

మెడికల్ షాపులకు రూ. 9000 ఫైన్

- Advertisement -
- Advertisement -

fine

మనతెలంగాణ/దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చిన్న నల్లబల్లి, పెద్ద నల్లబల్లి గ్రామ పంచాయితీలల్లోని ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్‌కు విరుద్దంగా మూడు మెడికల్ షాపులకు స్దానిక ఎంపిడిఓ బైరు మల్లీశ్వరి, వైద్యాధికారి బాలాజీ నాయక్ 9000/.. ఫైన్ విధించారు. కోవిడ్..19 నిర్మూలన చర్యల్లో భాగంగా మండలంలోని పలు గ్రామ పంచాయితీల పర్యటనలో భాగంగా చిన్న నల్లబల్లి, పెద్ద నల్లబల్లి గ్రామ పంచాయితీలను స్థానిక ఎంపిడిఓ బైరు మల్లీశ్వరి, దుమ్ముగూడెం వైద్యాధికారి బాలాజీ నాయక్ సందర్శించారు. ఈ సందర్బంగా వారు ముందుగా పెదనల్లబల్లి సెంటర్‌లో గల కార్తీక్ మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్దంగా మొబైల్స్ సేల్స్, సెల్ రీఛార్ఝ్, నగదు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం వలన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండి సామాజిక దూరం పాటించకపోవడం వలన 3000 రూపాయల జరిమాన విధించారు. దీంతో పాటుగా నల్లబల్లి గ్రామ పంచాయితీలోని ప్రధాన సెంటర్‌లో గల శ్రీ బాలాజీ మెడికల్ షాపు వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, మొబైల్స్ రీచార్జ్ షాంపులు, పచ్చళ్ళ డబ్బాలు, లేస్ ప్యాకెట్‌లు వంటివి వుండటం వలన ఆమె రూ.3000… ఫైన్ వేశారు. అలాగే ఫ్రెండ్స్ మెడికల్ షాపు వద్ద సామాజిక దూరంతో పాటుగా మొబైల్స్ రీచార్ఝ్ వంటివి ఉండటం వలన రూ. 3000/… జరిమాన విధించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్‌కు విరుద్దంగా ఉన్నటువంటి మెడికల్ షాపులపై జరిమాన విధించినట్లు తెలిపారు. మెడికల్ షాపులకు అత్యవసర సేవల క్రింద 24 గంటలు తెరచి ఉంచే అవకాశం ఉందని, కేవలం మందులకు సంబంధించినవి మాత్రమే విక్రయించాలన్నారు. ఆమె ఆదేశాలపై ఒక్కో షాపు వద్ద రూ. 3000/… ఫైన్ సొమ్మును స్దానిక పంచాయితీ కార్యదర్శులు అజ్మీరా సరోజ, శోభారాణి వసూల్ చేసి పంచాయితీ అకౌంట్‌లో జమ చేశారు.

 

RS.9000 fine to medical shop in Lockdown in Khammam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News