Thursday, March 28, 2024

జమ్ముకశ్మీర్ ప్రాజెక్టుల్లో రూ. కోట్ల లంచగొండితనం…

- Advertisement -
- Advertisement -

Rs crore corruption in Jammu and Kashmir projects

రూ.300 కోట్లు లంచం ఇవ్వజూపారని మాజీ గవర్నర్ మాలిక్ ఆరోపణ
రెండు కేసుల నమోదు… 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ స్కీమ్, కురు హైడ్రోపవర్ ప్రాజెక్టు సివిల్ వర్కు కాంట్రాక్టుల్లో లంచగొండితనంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సిబిఐ రెండు కేసులను దాఖలు చేసింది. ఈ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ రెండిటిలో లంచగొండితనం జరుగుతోందంటూ సాక్షాత్తు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేరుగా ఆరోపణలు చేయడం, దానిపై సిబిఐ రెండు కేసులను దాఖలు చేయడం చర్చనీయాంశమౌతోంది. అధికారులు గురువారం ఈ వివరాలు తెలియజేశారు. ఈమేరకు నిందితులకు సంబంధించిన జమ్ము, శ్రీనగర్, ఢిల్లీ, ముంబై, నొయిడా, కేరళ లోని త్రివేండ్రం, బీహార్ లోని దర్భాంగా తదితర 14 ప్రాంతాల కార్యాలయాల్లో సిబిఐ సోదాలు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్ ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్సు స్కీమ్ కాంట్రాక్టును రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించడంలో 2017 18 లో దాదాపు రూ. 60 కోట్లు విడుదల కావడంలో లంచగొండితనం చోటుచేసుకుందని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

ఇదే విధంగా కురు హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు (హెచ్‌ఇపి) కు సంబంధించిన రూ. 2200 కోట్ల విలువైన సివిల్ వర్క్ కాంట్రాక్టును 2019 లో ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో కూడా లంచాలు ముట్టినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టుల ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్లు లంచం ఇవ్వజూపారని మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. కశ్మీర్‌కు తాను వెళ్లాక ఈ రెండు ఫైళ్లు తన దగ్గరకు క్లియరెన్సు కోసం వచ్చాయని, ఒకటి అంబానీకి, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన కాంట్రాక్టు అని మాలిక్ ఆరోపించారు. ఈ నిందితుడు ఇదివరకటి ముఫ్తీ (పీడీపిబిజెపి సంకీర్ణ) ప్రభుత్వం లో మంత్రిగా కూడా పనిచేశారు.

అంతేకాదు ప్రధానికి అత్యంత సన్నిహితుడని కూడా మాలిక్ ఆరోపించారు. ఈ రెండు విభాగాల్లో స్కామ్ జరుగుతోందని సెక్రటరీలు తనకు తెలియచేయడంతో ఈ రెండు కాంట్రాక్టులను తాను రద్దు చేశానని మాలిక్ చెప్పారు. ఈ ఫైళ్లు క్లియర్ చేస్తే ఒక్కోదానికి రూ. 150 కోట్లు వంతున ముడుపులు ముడతాయని వారు చెప్పారని, అయితే తాను ఐదు కుర్తాపైజమాలతో కశ్మీర్‌కు వచ్చానని, అలాగే ఇక్కడ నుంచి వెళ్లిపోతానని వారికి చెప్పినట్టు మాలిక్ వివరించారు. గత ఏడాది రాజస్థాన్ లోని ఝుంఝునులో ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News