Home తాజా వార్తలు రూ. 35 కోట్ల వెండి…

రూ. 35 కోట్ల వెండి…

Silver

 

లండన్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టివేత

బోయిన్‌పల్లి: 35కోట్ల రూపాయలు విలువ చేసే వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం… అమీర్‌పేట్ అర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ లండన్‌లోని ఓ సంస్థ వద్ద 35 కోట్ల రూపాయల విలువ చేసే 10 వేల868 కిలోల వెండి కడ్డీలను కొనుగోలు చేసింది. జేపి మోర్గాన్ కంపెనీ వెండిని లండన్ నుంచి భారతదేశానికి తరలించి అర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్‌కు సురక్షితంగా అప్పగించే బాధ్యతలు తీసుకుందని లండన్ నుంచి షిప్‌ద్వారా నెల్లూరు ఓడరేవు ద్వారా వెండిని తరలించి జెపి మోర్గాన్ కంపెనీ ఈ విషయాన్ని అర్బీఎల్ బ్యాంక్‌కు సమాచారం అందించారు. బ్యాంక్ జిఎస్టీ క్లియర్ చేసుకోవటంతో జెపి మోర్గాన్ కంపెనీ నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెండిని తరలించే బాధ్యతను బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది.

దీంతో సదరు కంపెనీ కంటైనర్‌లో వెండిని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు ఔటర్‌రింగ్‌రోడ్డు మీదుగా ఈనెల 9న తేదీన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డైరీఫారం వద్ద తరలించినప్పటికీ ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కంటైనర్‌లోని వెండి కడ్డీలను మరొక వాహనంలోకి అన్‌లోడ్ చేస్తుండటంతో అనుమానం రావటంతో అక్కడే వాహనాలు తనిఖీలు చేస్తున్న సిఐ రాజేష్ ఇతర సిబ్బంది వెండి కంటైనర్‌తో పాటు ఇతర వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బ్రింక్స్ సంస్థకు చెందిన వాహన డ్రైవర్ల వద్ద సరైనధృవీకరణ పత్రాలు లేక పోవటంతో మరిన్ని ఆనుమానాలు వచ్చాయి.దీంతో ఉన్నతధికారులు ఆదేశాలతో పోలీసులు జిఎస్టీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిఎస్టీ మేడ్చల్ సూపరిండెంట్ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వెండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు వారికి అందజేశారు. పత్రాలు సరిగ్గా ఉండటంతో వెండి కడ్డీలను వాహనాలను వారికి అప్పగించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Rs. Police seized 35 crores Silver