మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధం గా తెలంగాణలో రూ. 5 వేల కోట్ల అంచనా వ్యయంతో 2 లక్షల 8 వేల 489 యూనిట్లను విజయవంతంగా లబ్ధిదారులకు అందజేసినట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి, పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ మంత్రి టి. శ్రీని వాస్ యాదవ్ అన్నారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్‌లు, జేసిలు, పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ, హర్టీకల్చర్ అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంపిణీ చేసిన గొర్రెలకు వచ్చే వేసవిలో పచ్చి మేత అవసరాలను బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గ్రామం లో లబ్ధిపొందిన రైతులకు 75శాతం సబ్సిడీతో పచ్చిగడ్డి పెంచేందుకు వారిలో అవగాహన పెంచాలని, రైతులు తమ సొంత భూమిలో పశు గ్రాసం పెంచేందుకు, ప్రతీ జిల్లాలో గొర్రెల పంపిణీ 90శాతం వరకు పూర్తయినందున వాటిని రక్షించేందుకు 3 సార్లు వాక్సీనేషన్ చేయిం చేలా రైతులకు అవగాహన కల్పించాలని, 5 జిల్లాలో 95శాతం పంపిణీ పూర్తి చేసి ఫస్ట్ ఫేస్ పూర్తి చేసిన వారు వాటి ఇన్సూరెన్స్ 100శాతం చేసేలా పశు సంవర్థకశాఖ అధికారులు చూడాలని ఆయన అన్నారు. చేప పిల్లల పెంపకానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపు చేయాలని, వాటికి కావల్సిన అన్ని సదుపాయాలు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మత్సశాఖ అధికారులు శ్రద్ధ చూపాలని, రాష్ట్రం లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మం జూరు చేసిన ఇంకా 179 కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం కాలేదని, శాఖలో సిబ్బంది తక్కువగా లేకుండా నియామకాలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు పథకాలు అమలులో జిల్లా కలెక్టర్లు, వారి టీమ్ మంచిగా కృ షి చేసినందున వారికి మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలి పా రు. పథకాలు అమలుకు కొత్తగా ఆలోచనలు ఉన్నట్లయితే తమ దృ ష్టికి తేవాలని, టెక్నాలజీని ఉపయోగించేందుకు ముందుకు రావాలని, మత్సకారులకు, గొర్ల లబ్దిదారులకు సదస్సులు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ప్రతీ జిల్లాకు ఒక వాటర్ టెస్టింగ్ కిట్‌ను అందజేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఇప్పటికి జిల్లాలో 14,660ల యూనిట్లను మంజూరీ చేయడం జరిగిందని, మంజూరీ చేసిన గొర్రెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, వచ్చే వేసవిలో పచ్చగడ్డి కొరత లేకుం డా 75శాతం సబ్సిడీతో పచ్చగడ్డి పెంచేందుకు అవగాహన కల్పించి రైతులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటర్ టబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, గతంలో నిర్మించిన వాటికి మరమత్తులు అవసర మైనట్ల యితే ఆర్‌డ బ్లూఎస్ శాఖతో చేయించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా బౌండ్రీ లలోని చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి పోలీస్ వారు పర్యవే క్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మత్స శాఖ కమీషనర్ సువర్ణ, పశు సంవర్థక శాఖ డాక్టర్ వెంకటే శ్వర్లు, అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జాయింట్ కలెక్టర్ నారాయ ణరెడ్డి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ సిహెచ్.రమేష్, జిల్లా మత్సశాఖ అధికారి ఎం.చరిత, జిల్లా హార్టికల్చర్ అధికారి సంగీత, లక్ష్మీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ
- Advertisement -
- Advertisement -