Home జాతీయ వార్తలు రామాలయం కోసం ఎంతో మంది బలిదానం చేశారు : మోహన్ భగవత్

రామాలయం కోసం ఎంతో మంది బలిదానం చేశారు : మోహన్ భగవత్

RSS Chief Mohan Bhagwat Comments On Ram Templeలక్నో : అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఎంతో మంది బలిదానం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. తమ 30 ఏళ్ల కల బుధవారంతో సాకారమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం రామాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. రాముడిని దేవుడిగా కొలిచే భారత్ ప్రజలు ఇప్పడు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు రామాలయ నిర్మాణం కోసం ఎందరో ప్రముఖులు పోరాటం చేశారని, వారి పోరాటానికి ఫలితం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా ఈ ఆలయం కోసం పోరాడిన వారు భూమి పూజకు హాజరు కాలేకపోయారని, ఈ కార్యక్రమాన్ని అద్వానీ ఇంట్లో నుంచే వీక్షించారని ఆయన తెలిపారు. రామాలయ నిర్మాణ భూమి పూజలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.