Home తాజా వార్తలు ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

RTC bus

 

కొందుర్గు జిల్లేడ్ చౌదరిగూడ : ఆర్టీసీ బస్సుకు బ్రేకులు రాకపోవడంతో చేట్ల పొదల్లోకి దూసుకుపోయిన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని లాల్‌పహడ్ చౌదరిగూడ వెళ్లె మార్గమద్యంలో బుధవారం మద్యాహ్న 2 గంటల సమయంలో చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికులు తెలిపిన కథనం ప్రకారం షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు షాద్‌నగర్ నుండి గాలిగూడ వైపు వస్తున్న ఎపి28జెడ్ 1384 అనే నెంబరు గల ఆర్టీసీ బస్సు లాల్‌పహడ్ కస్తూర్బా గాందీ బాలికల పాఠశాల ముందుకు రాగానే చౌదరిగూడ వైపు ఓ గుర్తు తెలియని బైక్ వచ్చిందని రోడ్డు బాగాలేకపోవడంతో ఆ బైకుకు సైడ్ ఇవ్వడం కోసం డ్రైవర్ బ్రేక్ వేయడంతో బ్రేకులు పని చేయలేదని, డ్రైవర్ జాగ్రత్తగా గేర్లు మార్చి బస్సును వేగం తగ్గించడంతో కొంత దూరం వెళ్లి ప్రక్కనే ఉన్నా చెట్ల పొదల్లోకి బస్సు దూసుకుపోయిందని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 66 మంది ప్రయాణికులు ఉన్నారని బస్సు కండక్టర్ తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

RTC bus that survived the Accident