Home కరీంనగర్ ప్రతి ఊరుకు బస్సు : ఈటల

ప్రతి ఊరుకు బస్సు : ఈటల

ETALA

కరీంనగర్ : ప్రతి ఊరుకు బస్సు సౌకర్యం కలిపించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జిల్లా పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా కార్యాలయంలో ఈటలతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ తదితరులు ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ఆర్‌టిసిన వ్యాపార కోణంలో చూడడం లేదని, ప్రజా కోణంలో చూస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లా బస్టాండ్ల ఆధునీకరణకు రూ.14కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు.

RTC Bus to Each Village : Etala