Home తాజా వార్తలు అల్వాల్ లో రోడ్డు ప్రమాదం: ఆర్ టిసి డ్రైవర్ మృతి

అల్వాల్ లో రోడ్డు ప్రమాదం: ఆర్ టిసి డ్రైవర్ మృతి

RTC Driver dead in Road accident

మేడ్చల్: మల్కాజ్ గిరి ప్రాంతం అల్వాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని పాల వ్యాను ఢీకొట్టడంతో అతడు దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మాధవరెడ్డిగా గుర్తించారు. ఆర్ టిసి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.