Home తాజా వార్తలు తప్పతాగి బస్సు నడిపిన ఆర్‌టిసి డ్రైవర్

తప్పతాగి బస్సు నడిపిన ఆర్‌టిసి డ్రైవర్

RTC driver

 

ప్రయాణికుల సమాచారంతో పోలీసుల తనిఖీ

జైనూర్ : తప్పతాగి బస్సు నడిపించి హల్‌చల్ సృష్టించిన ఓ ఆర్‌టిసి డ్రైవర్ సంఘటన మంచిర్యాల జిల్లా జైనూరు మ ండలంలో శనివారం చోటు చేసుకుంది. బస్సులో కూర్చున్న పాపానికి ప్రయాణికులు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసే దుస్థితి ఏర్పడింది. చివరకు బస్సులోని ప్రయాణికులు కొందరు జైనూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఆందించడంతో జైనూర్‌లో బస్సును నిలిపివేసిన పోలీసులు డ్రైవర్‌కు డ్రంక్‌అండ్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించి తేల్చడంతో ఈ విషయం బయటపడింది.

దీంతో సంబంధిత బస్సు ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. వివరాల్లోకి వెలితే శనివారం ఆసిఫాబాద్ నుండి బస్సు నెంబర్ టిఎస్01విఎ 1923 నెంబర్ గల బస్సు డ్రైవర్ తేజ సుమారు 50 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్‌కు బయలుదేరాడు. ఆంతలోనే బస్సు ఆడ్డదిడ్డంగా ఆతివేగంతో బస్సును తీసుకెళ్లడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పినా వినకపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయందోళనకు గురి అయ్యారు.

కెరమెరి ఘాట్‌లో పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో జైనూర్ పోలీస్ స్టేషన్‌కు ప్రయాణికులు సమాచారం ఆందించారు. జైనూర్ పోలీసులు వెంటనే స్పందించి జైనూర్‌లో బస్సును నిలిపివేశారు. డ్రైవర్ తేజకు డ్రంక్‌అండ్‌డ్రైవ్ పరీక్ష నిర్వహించి, అందులొ మద్యం సేవించినట్లు ధ్రువీకరించారు.

RTC driver drank alcohol and drive a bus