Tuesday, September 26, 2023

నర్సంపేటలో ఆర్‌టిసి ఉద్యోగి ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

RTC Employee commit suicide in Narsampet

వరంగల్: ఆర్‌టిసి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నర్సింపేట డిపో పరిధిలో జరిగింది. ఎండి ఇమ్రాన్ కారుణ్య నియామకం ద్వారా ఆర్ టిసి సంస్థలో చేరాడు. ఎంబిఎ చదవడంతో వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అకౌంట్ విభాగంలో పని చేస్తున్నాడు. నర్సంపేట పట్టణంలోని పోచమ్మ దేవాలయం దగ్గర తన ఇంటిలో ఇమ్రాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News