Home Default ఆర్ టిసి ఫిట్ లెస్

ఆర్ టిసి ఫిట్ లెస్

rtc

*రోడ్డుమీదనే మొరాయిస్తున్న బస్సులు
*ప్రయాణికులకు, చోదకులకు తీవ్ర ఇబ్బందులు
*మరమ్మతులకు లోనైతే గంటల తరబడి రోడ్డుపైనే నిలిపివేత
*మొబైల్ కేంద్రాల జాడే లేదు!

గ్రేటర్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఆరంభ శూరత్వంగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే రోడ్లపై చెడిపోయి ఇటు ప్రయాణికులను అటు వాహన చోదకులను సిటీ బస్సులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బస్సు ఎప్పుడు  ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బ్రేక్ డౌన్స్ అధిగమించేందుకు అధికారులు డిపో స్థాయిలో పూర్తి మరమ్మతులు చేస్తామన్నారు. మోబైల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ఇవన్నీ ప్రతిపాదనలు, ప్రణాళికలకు మాత్రమే పరిమితం అయ్యాయి. దీంతో ఎప్పటిలా బస్సులు చెడిపోతున్నాయి. ప్రతి నెలా 200 నుంచి 300 బస్సులు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. కాలం చెల్లిన వెయ్యికి పైగా ఉన్న డొక్కు బస్సులు గ్రేటర్ ఆర్టీసికి నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు పదుల సం ఖ్యలో బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంబించి పో తుంది. మెట్రో పనుల కారణంగా రహదారుల విస్తీర్ణం కూడా తగ్గిపోతోంది. అదే మార్గంలో బ్రేక్ డౌన్స్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉదయం,సాయంత్ర వేళల్లో బస్లుల్లో వెళ్ళే ప్రయాణికులే కాకుండా సొంత వాహనాలు, ట్యాక్సీలు , ఆటోలు వంటి వాటిల్లో వెళ్ళే ప్ర యాణికులు సైతం రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గ్రేటర్‌లో 29 డిపోల నుంచి ప్రతి రోజు 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సుదపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్థం లేని, నాణ్యత లేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి. రోజుకు 10 నుంచి 15 బస్సులు నగరంలో ఏదో ప్రాంతంలో ఆగిపోతున్నాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలో మీటర్ల రవాణా సుదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలో మీటర్ల నుంచి 3750 కిలో మీటర్ల వరకు సర్వీసులు నిలిచిపోతున్నాయి. జీత భత్యాలు, ఇంధన భారం, విడిభాగాల కొనుగోళ్ళు వివిధ కారణాల వల్ల రోజుకు కోటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది దీంతో ఆక్యుపెన్సీ రేటు కూడా పడిపోతుంది. అంతే కాకుండా ఆర్టీసి బస్సుల పనితీరుతో విసిగిపోయిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు.దీంతో ఆర్టిసీలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో సంస్థ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది.
తగిన చర్యలు తీసుకుంటున్నాం… బ్రేక్ డౌన్స్ నియంత్రణ కోసం క్షణాల్లో బస్సు వద్ద కు చేరుకునే మోబైల్ రిలీఫ్ వాహనాలు, బైక్‌లను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విడిభాగాలు, మెకానిక్‌లతో కూడిన 6 మోబైల్ రిలీఫ్ వాహనాలు ట్రాఫిక్ రద్దీ దారితీసే మెట్రో పనులు జరుగుతున్నా కోఠీ, లకిడికా పూల్, ఎల్‌బినగర్, ఈఎస్‌ఐ, లింగంపల్లి, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. బస్సుల ఫిట్‌నెస్ మీద తాము పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నామని అధకారులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు బస్సులను బ్రేక్ పని తీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బస్సులను బయటకు పంపుతున్నామంటున్నారు. బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి తాము షె డూల్య్ -1( ప్రతి రోజు బస్సుల బ్రేక్‌ల పనితీరును పరిశీలించడం), షెడ్యూల్-3 (వారానికి ఒక సారి పరిశీలించడం), షెడ్యూల్-3 (నెలకు ఒక సారి బ్రేక్‌ల పని తీరు పరిశిలించడం) ఈ విధంగా మూడు సార్లు బస్సును పూర్తి స్థాయిలో పరిశీలించ డం జరుగుతుందంటున్నారు. బస్సు ఫిట్‌నెస్ సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత బస్సులను బ్రేక్‌లను, ఇంజన్ పనితీరును చెక్ చేయడం జరుగుతుందని మెకానికల్ విభాగానికి చెందిన ఇంజనీర్లు చెబుతున్నారు.