Home తాజా వార్తలు గవర్నర్‌ను కలిసిన ఆర్టీసి జెఎసి నేతలు

గవర్నర్‌ను కలిసిన ఆర్టీసి జెఎసి నేతలు

tamilisai

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు, వేతనాలు లేక కార్మికులు ఇబ్బందులను వారు గవర్నర్ కు వివరించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. గవర్నర్ కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసి కన్వీనర్ అశ్వథామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… సింగరేణి సంఘాలను కలిసి తమకు మద్ధతు తెలపాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

రేపు జూబ్లీ బస్‌స్టేషన్‌లో వంటావార్పు కార్యక్రమం ఉంటుందని పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని ఆయన తెలిపారు. తమ పోరాటం అహింసా పద్ధతిలో, శాంతియుతంగా కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ సమ్మెపై తనకు స్పష్టత ఉందని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ తెలిపినట్టుగా అశ్వథామరెడ్డి తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించడానికి సంస్థ దగ్గర నిధులు లేవని, రోజు 90 శాతం బస్సులు నడిపినప్పుడు జీతాలు చెల్లించడానికి యాజమాన్యం దగ్గర నిధుల కొరత ఎందుకు ఏర్పడిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

RTC JAC Leaders meet Governor Tamilisai at Raj Bhavan