Home తాజా వార్తలు ఆర్టీసీ సమ్మెపై రేపు కీలక సమావేశాలు!

ఆర్టీసీ సమ్మెపై రేపు కీలక సమావేశాలు!

TSRTC

 

హైదరాబాద్: తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె దసరా సెలవుల్లో ప్రారంభం కావడంతో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదని, గురువారం నుంచి పాఠశాలలు తెరచుకుంటాయి కాబట్టి సమస్యలు మొదలవుతాయని జెఎసి నేతలు చెబుతున్నారు. దసరా సెలవుల నిమిత్తం స్వస్థలాలకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే డిపోల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్చలు జరిగినప్పట్టికి బుధవారం మరోసారి ఆర్టీసీ ఉన్నతాధికారులు లీగల్ నోటీసుల విషయంపైనా ప్రభుత్వ పెద్దలతో సమావేశం కానున్నారు. తెలంగాణ సర్కారు ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తూ, రేపు అఖిలపక్ష నేతలు సమావేశమై పరిస్థితిని చర్చించనున్నారు.

RTC Officials Meet with Government on legal notices