Home తాజా వార్తలు నేడు చర్చలు…

నేడు చర్చలు…

CM KCR

ఆర్‌టిసి సమ్మె పరిష్కారం దిశగా కీలక మలుపు
ఉదయం 11గం.కు హైదరాబాద్ బస్‌భవన్‌లో యూనియన్లతో ఆర్‌టిసి యాజమాన్యం చర్చలు
ఆర్థికేతర 12 అంశాలపై చర్చలు జరపనున్న ఇడిలు

20 రోజులుగా సాగుతున్న ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు తెరపడగలదనే ఆశలు అంకురించాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌లో శుక్రవారం నాడు రవాణా మంత్రి, అJధికారులతో 4గం.పాటు చర్చించిన మీదట కార్మిక సంఘాలతో చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అంతకుముందు యూనియన్ల డిమాండ్లలోని 21 అంశాలపై ఇడిల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్‌టిసి బస్‌భవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ల(ఇడి) స్థాయిలోనే కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఆర్‌టిసి కార్మికుల డిమాండ్లలోని ప్రధాన అంశాలకు సంబంధించిన (ఆర్థికపరంగా ముడిపడని) 12 అంశాలపైనే చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. మొత్తం 45 డిమాండ్లను ఆర్‌టిసి కార్మికులు రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకురాగా, అందులో 21 అంశాలపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హై కో ర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చించే అంశాలపై ఇడి స్థాయి అధికారులతో సిఎం కెసిఆర్ ఇటీవల ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ అధికారుల బృందం మూడు రోజుల పాటు కసరత్తు చేసి ఒక నివేదికను శుక్రవారం సా యంత్రం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌కు అందజేసింది. ఇడి స్థాయి అధికారులు అధ్యయనం చేసిన 21 అంశాలలో ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలతో నివేదికను రూపొందించారు. ఈ నివేదికను 28న హైకోర్టులో జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వపక్షాన అడ్వకేట్ జనరల్ వాదనలు వివరించనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా ఆర్‌టిసి అద్దెబస్సుల అవసరం, నిర్వహణపై కూడా కమిటీ మరో నివేదికను రూపొందించింది. సుమారు నాలు గు గంటల పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇడి కమిటీ రూపొందించి న నివేదికను సిఎం క్షుణ్ణంగా పరిశీలించా రు. మూడు రోజులుగా ఆర్‌టిసి కార్మికు ల 21 అంశాలపై అధ్యయన కమిటీ కసరత్తు చేసింది.
వాటిలో ఏయే డిమాండ్లు నెరవేరిస్తే ఆర్‌టిసిపై ఎంత ఆర్థిక భారం పడుతుంది..? కార్మికుల డిమాండ్లలో ఏవి సాధ్యం..? ఏవి అసాధ్యం..? అన్న అంశాలపై ఇడిల కమిటి సమగ్రంగా అధ్యయనం చేసిన నివేదికను ఆర్‌టిసి ఇన్‌చార్జ్ ఎండి సునీల్‌శర్మకు అందించారు. దీంతో చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, రవాణా శాఖ మంత్రి పువ్వా డ అజయ్ కుమార్, ఆర్‌టిసి ఇన్‌చార్జ్ ఎండి సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఇడిల కమి టీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే కార్మిక సంఘాలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన సర్వీసులు…
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు అందరూ సమన్వయంగా పనిచేస్తూ ప్రజారవాణాను మరింత పెంచే దిశలో కృషిచేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సదుపాయాలు మెరుగుకై తమవంతుగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు నడిచిన బస్సుల సంఖ్యను గమనించినట్లయితే 1,928 అద్దె బస్సుల ను కలుపుకుని మొత్తం 6,519 బస్సుల ను తిప్పగలిగారు. 11వేలకు పైగా తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌లు విధులు నిర్వర్తించగా, 4,320 బస్సుల్లో టిమ్స్ ద్వారా, 1,402 బస్సుల్లో నేరుగా టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగింది. కాగా, నిర్దేశించిన చార్జీలు మాత్రమే వసూలు చేయడం, విధి గా టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు చేపట్టే విషయాలపై అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంపై డిపో నుంచి బస్సు బయటకు బయలుదేరేముందు తాత్కాలిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
సంస్థ జారీ చేసే బస్ పాసులను తప్పనిసరిగా అనుమతించాల ని చెబుతూ వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, టి, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఐఎఎస్‌లు ప్రజారవాణా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికిగానూ అవకాశాలన్నింటిపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు రవాణా లోటు కనబడకుండా చూడాలని, అవసరమైన మేరకు బస్సు సర్వీసుల్ని తిప్పి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RTC Ownership will talks with unions in Bus Bhavan