Home జాతీయ వార్తలు కుళ్లిపోయినస్థితిలో ఆర్టిఐ కార్యకర్త మృతదేహం లభ్యం

కుళ్లిపోయినస్థితిలో ఆర్టిఐ కార్యకర్త మృతదేహం లభ్యం

 

 

ముంబయి:   సమాచార హక్కు చట్టం కార్యకర్తను హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా తామ్హిని ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  వినాయక్ శిర్ శాత్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టంలో చురుకుగా పని చేసేవారు. ఫిబ్రవరి 5వ తేదీన వినాయక్ శిర్ శాత్ కనిపించడం లేదని ఆయన తమ్ముడు కిశోర్  భారతీ విద్యాపీత్ పోలీస్ స్టేషన్ లో   ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  వినాయక్ ఏ ప్రాంతంలో ఉన్నాడని తెలుసకోవడానికి ఫోన్ ను ట్రేస్ చేశారు. తమ్హిని ఘాట్ ప్రాంతంలోని ముతా గ్రామంలో చివరగా ఆయన ఫోన్ వాడినట్లు గా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి ఆయన కోసం వెతుకుతుండగా,  బుధవారం  ఉదయం వినాయక్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 201 కింద పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్టు సమాచారం.

 

RTI Activist Found Dead Body with Decomposing