Friday, March 29, 2024

రుద్రాక్ష- జగద్రక్ష

- Advertisement -
- Advertisement -

rudraksha

శివునితో సమానమైనది విభూతి, రుద్రాక్షలు, మారేడు దళం. శివుని తాకి వెళ్ళిన గంగ చాలా పవిత్రమైనది, అందుకే గంగను ‘భవాంగపతితం తోయం’ అని చెబుతారు. అంత పవిత్రమైనదే రుద్రాక్ష కూడా. పురాణ గాధ: కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు. ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాల నుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు, మలయ, సహ్యాద్రి పర్వతాల్లో పడి ఒక చెట్టులా ఉద్భవించాయి. ఆ చెట్టు నుండి వచ్చిన గింజలే కాలాంతరాన రుద్రాక్షలుగా పరిణమించాయి. మరో కథకూడా ఉంది. హాలాహలం తాగాక శివుని నేత్రాల నుండి పడిన బాష్పాల ద్వారా రుద్రాక్ష మొక్కలు ఆవిర్భవించాయిట. శివుని నుండి ఆవిర్భవించాయి కాబట్టి వాటికి తాకితే శివుని తాకినంత పుణ్యమని భావిస్తారు.

మరో కథలో రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరా డి, మూడు పురాలను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అంటే రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం, ధరించడం అనాదిగా వస్తోంది. రుద్ర అంటే దుఃఖాలను, క్షయం అంటే నాశనం చేసే గుణం కలిగినందువల్ల వీటికి ‘రుద్రాక్షలనే ‘ పేరు సార్ధకమైంది.

పూర్వాపరాలు : రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం ‘ ఏలేఒచర్పుస్ ఘనిత్రుస్‘ . రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాల్లో, నేపాల్ లో, ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. మామిడి చెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. ఫలం పై పొర దళసరిగా ఉంటుంది. పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిది. పండు పుల్లగా ఉంటుంది. వాత, కఫ దోషాలను నివారిస్తుంది. రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రంగా మారుతాయి. దీని మధ్య భాగానగల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

అన్నీ ధరించకూడదు: రుద్రాక్షలన్నీ ధరించ దగ్గవి కావు. కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ, పురుగులు ప్రవేశించినవీ, గుండ్రంగా లేనివీ, కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే! నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి. మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు, ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.

రుద్రాక్ష రకాలు : వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి…ఇలా మొత్తం 14 వరకూ ఉన్నాయి. ఇవిగాక కొన్ని ప్ర త్యేకమైనవీ ఉన్నప్పటికీ, అవి అరుదుగా లభిస్తాయి. వారి పూర్వ పుణ్యానుసారం లభిస్తే లభించ వచ్చునేమో గానీ, సాధారణంగా అలభ్యం అనే చెప్పాలి.

రుద్రాక్ష ఉపయోగాలు * రుద్రాక్షలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. రుద్రాక్ష శరీరం మీద ఉండడం వల్ల హానికారమైన క్రిములను నాశనం చేస్తుంది. రుద్రాక్షల్లో మాగ్నటిక్ పవర్ ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించి.. విద్యుత్ ప్రసరణ జరిగే విధంగా చేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. టెన్షన్ వంటి మానసిక సమస్యలను కూడా రుద్రాక్షలు దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రుద్రాక్ష పూలు మూర్ఛ, అపస్మారకం తలతిప్పుటను దూరం చేస్తాయి. కంటికి సంబంధించిన సమస్యలున్నా, చర్మవ్యాధులు తొలగుతాయి.

* మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి. నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసిందే! తేనెలో అరగదీసి మూర్ఛరోగాన్ని పోగొట్టవచ్చు!
* రాత్రిపూట రాగి గిన్నెలో నీరుపోసి అందులో రెండు రుద్రాక్షలు వేసి ఆ నీరు పడగడున తాగితే ఎంతో ఆరోగ్యకరమని చెబుతారు. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

నియమాలు : రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. స్త్రీలు రుతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు, తాకకూడదు.

* రుద్రాక్ష మాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
* రుద్రాక్ష మాలను ధరించి నిద్రపోకూడదు
* రుద్రాక్ష మాలను ఉంగరంలో ధరించకూడదు.

Rudraksha Benefits in Telugu

విశాలి పేరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News