Home మంచిర్యాల రగులుతున్న అసమ్మతి సెగలు

రగులుతున్న అసమ్మతి సెగలు

sccl

* అనుభవం లేని వారికి కీలక పదవులు
* డిప్యూటేషన్‌లపై పని చేసే కార్మికులకు ఫిట్ కమిటీల్లో స్థానం
* సిఎం ప్రకటనలో పేర్లు గలంతు
* వలస నాయకులకే పెద్దపీట
* సింగరేణి గుర్తింపు సంఘంలో మళ్లీ అంతర్యుద్ధం
* టిబిజికెఎస్ కమిటీలపై అసంతృప్తిలో నేతలు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి   గుర్తింపు సంఘం టిబిజికెఎస్‌లో అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి. మొదటి నుంచి పదవుల కోసం ఆశించిన నేతల పేర్లు సిఎం ప్రకటించిన జాబితాల్లో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా టిబిజికెఎస్ 9 డివిజన్‌లలో గెలుపొంది గుర్తింపు సంఘంగా ఏర్పడినప్పటికీ గత ఐదు నెలలుగా కమిటీని ఏర్పాటు చేయలేదు. ఐదు నెలల తరువాత ఏర్పాటు చేసిన కమిటీలలో సిఎంకు పంపించిన పేర్లు లేవని కమిటీకి పొంతన కనిపించడం లేదని నాయకులు అసంతృప్తికి లోనవుతున్నారు. పలు ఏరియాలలో అనుభవం లేని వారికి కీలక పదవులు ఇచ్చారని, అంతే కాకుండా డిప్యూటేషన్లపై పని చేస్తున్న కార్మికులకు ఫిట్ కమిటీలలో స్థానం కల్పించారని వాపోతున్నారు. ఇతర సంఘాలు పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకే పెద్ద పీట వేసి, కమిటీలలో స్థానం కల్పించారని, మొదటి నుంచి సంఘంలో పని చేస్తున్న వారికి పదవులు దక్కలేదని వాపోతున్నారు. సిఎం కెసిఆర్ ఈనెల 9న ప్రకటించిన కమిటీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, గనులపై పార్టీ యంత్రాంగం నేరుగా కార్మికులను కలసి సర్వేలు నిర్వహించాయని నిఘా వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకొని, మరి కమిటీలను ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు వెలువడగా చివరికి కమిటీ ప్రకటించిన తరువాత జాబితాలో చోటు దక్కని నేతలు ఒక్కసారిగా మానసిక ఆందోళనలకు గురయ్యారు. రాష్ట్ర కమిటీ నుంచి మొదలుకుంటే ఏరియా స్థాయిలో చర్చల కమిటీ వరకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేసి, ప్రకటించిన జాబితాలు అనుభవం లేని వారికి ప్రాధాన్యత కల్పించాలని ఆరోపణలు ఉన్నాయి.

కమిటీల ఏర్పాటులో ప్రదాన భూమిక పోషించిన నాయకులను ప్రసన్నం చేసుకున్న వారికి పదవులు దక్కాయని వాపోతున్నారు. కొందరికి పదవులు దక్కకున్న వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నా బహిర్గం చేయడానికి వెనుకాడుతున్నారు. ఇంత కాలం నమ్ముకున్న నేతలను కలిసేందుకు సిద్దమవుతున్నారు. సమస్యలపై అవగాహన లేక అధికారులతో చర్చించడానికి తగిన స్తోమతలేని నాయకులను కమిటీలకు తీసుకోవడం వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని, పలువురు నేతలు అంటున్నారు. టిబిజికెఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి టిబిజికెఎస్‌కు గుర్తింపు తెచ్చిన సీనియర్ నాయకులను విస్మరించి కొత్త వారికి, కార్మిక సంఘంలో అనుభవం లేనివారికి ఏకంగా కీలక పదవులు కట్ట బెట్టారని వాపోతున్నారు. అదే విధంగా ఫిట్ కమిటీలలో గనులు, వివిధ డిపార్టుమెంట్‌లలో శాశ్వత ప్రాతిపదికన పని చేసే వారిని విస్మరించి డిప్యూటేషన్‌లపై వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసే ప్రాంతాల్లో పదవులను ఏవిధంగా అంటబెడుతారని కొందరు నాయకులు వాపోతున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సిహెచ్‌పిలో డిప్యూటేషన్ చేయాల్సిన నాయకునికి ఫిట్ కార్యదర్శి పదవి కట్ట బెడితే మరో గనిలో ఆగ్రకులానికి చెందిన వ్యక్తికి బిసి కోట కింద ఫిట్ కార్యదర్శిగా ఎంపిక చేశారని వాపోతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార సమయంలో ఇతర సంఘాల నుంచి వలస వచ్చిన నాయకులకు కూడా పదవులను కట్ట బెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. మణుగూరు ఏరియాలో కీలక పదవిని దక్కించుకున్న నేత ఒకరు పదవులను ప్రకటించిన రోజే టిఆర్‌ఎస్ కండువ మార్చుకున్నారని, అలాంటి వ్యక్తికి అంత ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చారో సీనియర్‌లకు కూడా అంతుపట్టని విధంగా మారింది. ప్రస్తుతం పదవులు దక్కని నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముఖ్య నాయకుల వద్దకు వెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేయడంలో అన్యాయం జరిగిందని, కమిటీలలో కొన్ని పేర్లను మార్పు చేయాలని టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు.

ఏదిఏమైనా ఐదు నెలల తరువాత సిఎం ప్రకటించిన కమిటీలో పేర్లు లేని వ్యక్తులు తీవ్ర అసంతృప్తికి లోనవుతుండగా మళ్లీ టిబిజికెఎస్‌లో అంతర్యుద్ధం నెలకొంది. కమిటీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, గనులపై పార్టీ యంత్రాంగం నేరుగా కార్మికులను కలసి సర్వేలు నిర్వహించాయని నిఘా వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకొని, మరి కమిటీలను ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు వెలువడగా చివరికి కమిటీ ప్రకటించిన తరువాత జాబితాలో చోటు దక్కని నేతలు ఒక్కసారిగా మానసిక ఆందోళనలకు గురయ్యారు. రాష్ట్ర కమిటీ నుంచి మొదలుకుంటే ఏరియా స్థాయిలో చర్చల కమిటీ వరకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేసి, ప్రకటించిన జాబితాలు అనుభవం లేని వారికి ప్రాధాన్యత కల్పించాలని ఆరోపణలు ఉన్నాయి. కమిటీల ఏర్పాటులో ప్రదాన భూమిక పోషించిన నాయకులను ప్రసన్నం చేసుకున్న వారికి పదవులు దక్కాయని వాపోతున్నారు. కొందరికి పదవులు దక్కకున్న వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నా బహిర్గం చేయడానికి వెనుకాడుతున్నారు. ఇంత కాలం నమ్ముకున్న నేతలను కలిసేందుకు సిద్దమవుతున్నారు. సమస్యలపై అవగాహన లేక అధికారులతో చర్చించడానికి తగిన స్తోమతలేని నాయకులను కమిటీలకు తీసుకోవడం వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని, పలువురు నేతలు అంటున్నారు. టిబిజికెఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి టిబిజికెఎస్‌కు గుర్తింపు తెచ్చిన సీనియర్ నాయకులను విస్మరించి కొత్త వారికి, కార్మిక సంఘంలో అనుభవం లేనివారికి ఏకంగా కీలక పదవులు కట్ట బెట్టారని వాపోతున్నారు. అదే విధంగా ఫిట్ కమిటీలలో గనులు, వివిధ డిపార్టుమెంట్‌లలో శాశ్వత ప్రాతిపదికన పని చేసే వారిని విస్మరించి డిప్యూటేషన్‌లపై వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసే ప్రాంతాల్లో పదవులను ఏవిధంగా అంటబెడుతారని కొందరు నాయకులు వాపోతున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సిహెచ్‌పిలో డిప్యూటేషన్ చేయాల్సిన నాయకునికి ఫిట్ కార్యదర్శి పదవి కట్ట బెడితే మరో గనిలో ఆగ్రకులానికి చెందిన వ్యక్తికి బిసి కోట కింద ఫిట్ కార్యదర్శిగా ఎంపిక చేశారని వాపోతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార సమయంలో ఇతర సంఘాల నుంచి వలస వచ్చిన నాయకులకు కూడా పదవులను కట్ట బెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. మణుగూరు ఏరియాలో కీలక పదవిని దక్కించుకున్న నేత ఒకరు పదవులను ప్రకటించిన రోజే టిఆర్‌ఎస్ కండువ మార్చుకున్నారని, అలాంటి వ్యక్తికి అంత ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చారో సీనియర్‌లకు కూడా అంతుపట్టని విధంగా మారింది. ప్రస్తుతం పదవులు దక్కని నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముఖ్య నాయకుల వద్దకు వెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేయడంలో అన్యాయం జరిగిందని, కమిటీలలో కొన్ని పేర్లను మార్పు చేయాలని టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. ఏదిఏమైనా ఐదు నెలల తరువాత సిఎం ప్రకటించిన కమిటీలో పేర్లు లేని వ్యక్తులు తీవ్ర అసంతృప్తికి లోనవుతుండగా మళ్లీ టిబిజికెఎస్‌లో అంతర్యుద్ధం నెలకొంది.