Saturday, April 20, 2024

‘సైంధవ్’ నుంచి డాక్టర్ రేణుగా రుహాని శర్మ పరిచయం

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

ఈరోజు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం ‘HIT’లో కనిపించిన రుహాని సైంధవ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది. నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో అనౌన్స్ మెంట్ ఉత్కంఠను రేపుతోంది. ఈ ఆసక్తికరమైన స్టార్ కాస్ట్ తో శైలేష్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంది.

ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ సాంకేతిక ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News