Home గాసిప్స్ మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనట..?!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనట..?!

Mahesh's Maharshi

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మహర్షి’. ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రిన్స్ నటిస్తున్న చిత్రం కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ సైతం చాలా ఆసక్తిరంగా ఉండడం, మహేష్ ను ఇంతకుముందు ఏ చిత్రంలో చూడని ఫ్రెష్ లుక్ లో చూపించడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘మహర్షి‘ ప్రిన్స్ కెరీర్ లోనే సమ్ థింగ్ స్పెషల్ మూవీగా నిలిచిపోనుందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలాఉండగా ఈ సినిమా కథ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లను చూసి కథను ఊహించే స్థాయిలో ఉన్న నేటి ప్రేక్షకుల ఊహజనిత కథతో హల్ చల్ చేస్తుంటారు. చాలాసార్లు అసలు కథ కన్నా..ఈ కొసరు కథలే బాగుంటున్నాయి కూడా. అలాగే చాలా వరకూ కరెక్ట్ అవుతున్నాయి… ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాయి. ఇలాగే ఇప్పుడు ‘మహర్షి’ కథపై కూడా ఓ రూమర్  ఫిల్మ్ సర్కిల్స్ లో స్ప్రెడ్ అవుతోంది. ‘మహర్షి’ కథ ఇదే అనేది ఈ గాసిప్స్ సారాంశం.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ‘మహర్షి’ కథ ఏంటంటే… చదువుకోసం  అమెరికాకు వెళ్లిన మహేష్ బాబు… అక్కడే సెటిల్ అవుతాడు. పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. ఈ క్రమంలో తండ్రి విషయమై ఓ రోజు  తన మిత్రులు అల్లరి నరేష్, పూజ హెడ్గేలతో కలిసి ఇండియాలోని తన ఊరికి వస్తాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ప్రిన్స్ ను కలిచివేస్తాయట. వ్యవసాయానికి వారు ఉపయోగించే పద్దతులు, వాటి వలన రాబడి పెద్దగా లేకపోవడం గమనించి ‘మహర్షి’ చలించిపోతాడట. దీనితో వ్యవసాయాన్ని అధునాతనంగా చేస్తే లాభసాటిగా ఉంటుందని రైతులకు చెబుతాడు. కానీ ఇక్కడి రైతులు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోరట. దాంతో తనే స్వయంగా ఓ రైతుగా మారి తన తెలితేటలతో అధునాతన పద్ధతుల్లో వ్యసాయం చేసి లాభసాటిగా మారుస్తాడట.

ముఖ్యంగా సేంద్రీయ విధానాలు, ఇతర ఆధునిక వ్యవసాయ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తాడట ‘మహర్షి’. ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమాలో ఊరును దత్తత తీసుకోవడం, ‘భరత్ అనే నేను’ చిత్రంలో బాధ్యత, జవాబుదారీతనం కలిగి ఉండడం వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని సమాజానికి మంచి సందేశం ఇచ్చాడు ప్రిన్స్. ఇప్పుడు ఈ మూవీలో వ్యవసాయంలో కొత్త పద్దతులతో ముందుకెళ్లే ఈ కాలం కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Rumour on Maharshi Movie Story goes Viral

Telangana Breaking News