Friday, March 29, 2024

ప్రభాస్‌కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

RussRussia award to Prabhas

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని అనుకున్నాం. కానీ ఈ చిత్రంతో అతను పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఈ విషయాన్ని నిరూపిస్తూ ప్రభాస్ తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఈ అవార్డు బాలీవుడ్ లెజెండ్ రాజ్ కపూర్‌కు 30 ఏళ్ల క్రితం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లుగా ఏ ఇండియన్ స్టార్ కూడా ఆ అవార్డును పొందలేక పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ‘బాహుబలి’ సినిమాతో రష్యా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్‌కు ఆ అవార్డు దక్కింది. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అనే అవార్డుకు అతను ఎంపిక అయ్యాడు. ఇక రాజ్ కుమార్ నటించిన శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలు రష్యాలో విడుదలై మంచి విజయం సాధించాయి. అందుకే రాజ్ కుమార్‌కు ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డు దక్కింది. మళ్లీ ఇన్నాళ్ల వరకు రష్యన్స్ ఏ ఇండియన్ సినిమాను పెద్దగా మెచ్చింది లేదు. బాహుబలి సినిమా ఇటీవలే అక్కడ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రష్యన్స్ బాహుబలి సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో ఈ అవార్డు ప్రభాస్‌కు దక్కింది. ఈ స్టార్ హీరో నటనకు రష్యన్స్ ఫిదా అవుతున్నారు. అద్భుతమైన నటన అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News