Thursday, April 25, 2024

ఒబామాతోసహా 500 మంది అమెరికన్లపై రష్యా ప్రవేశ నిషేధం

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు తోడుగా మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో తమ దేశం లోకి అమెరికా ప్రముఖులు 500 మంది ప్రవేశించకుండా రష్యా శుక్రవారం ఆంక్షలు విధించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రముఖ కమెడియన్ స్టీఫెన్ కోల్‌బెర్ట్ తదితరులు ఈ నిషేధ జాబితాలో ఉన్నారు. వ్యక్తిగతంగా వీరిపై ఫిర్యాదులేమి ఉన్నాయో రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ వివరించకుండా జాబితా విడుదల చేసింది. రష్యా అంటే భయంకలిగించే ఫోబియా (రసోఫోబియా) వ్యాపింపచేయడం, ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, తదితర ఆరోపణలు ఈ నిషేధం అమలుకు కారణాలుగా చూపింది. అమెరికా ప్రభుత్వ అసమ్మతివాదులను హింసించే అధికారులను కూడా ఈ జాబితాలో చేర్చారు.

Also Read: బీమా సెక్టార్‌లో 9 000 కొత్త ఉద్యోగాలు

అమెరికా చట్టసభ సభ్యులు 45 మంది, సెనేట్ సభ్యులు జెడి వాన్సే, కాటే బ్రిట్, ఎరిక్ సిమ్మిట్, మాజీ రాయబారులు నుంచి రష్యా జాన్ టెఫ్ట్,జాన్ హంట్స్‌మేన్‌లపై కూడా నిషేధం పడింది. గూఢచర్య నేరారోపణపై గత మార్చిలో అరెస్టయి రష్యా బందీగా ఉన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెరిష్‌కొవిచ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరిస్తున్నట్టు రష్యా వెల్లడించింది. గత నెల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికాలో పర్యటించేటప్పుడు ఆ పర్యటన వివరాలు కవర్ చేసేందుకు రష్యాజర్నలిస్టులకు అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ చర్యకు ప్రతిస్పందన గానే ఇవాన్‌కు కాన్సులర్ యాక్సెస్ తిరస్కరిస్తున్నట్టు రష్యా వివరించింది. రష్యాకు చెందిన 70 కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు మరింత కఠినం చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా ఆంక్షల ఎగవేతదారులు రష్యా సాంకేతిక సేకరణకు అనుసంధానింపబడి ఆర్థిక జరిమానాలకు గురవుతారని రష్యా హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News