Saturday, April 20, 2024

ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

Russia prepares for attack on Ukraine's eastern Donabas region

ఉక్రెయిన్ తూర్పు డొనబాస్ రీజియన్‌పై దాడికి రష్యా సన్నాహాలు

కీవ్ : ఉక్రెయిన్ తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించేముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని, దీనికోసం గతవారం లోఉక్రెయిన్ వైమానిక స్థావరాలను నాశనం చేశామని రష్యా సోమవారం వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యా దండయాత్ర మొదట్లో అనేక చోట్ల ముందుకు సాగకుండా ఆగిపోయింది. ఉక్రెయిన్ రాజధానిని, మిగతా నగరాలను రష్యా దళాల స్వాధీనం కాకుండా ఉక్రెయిన్ దళాలు అడ్డుకోగలిగాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని పూర్తిగా నియంత్రణ లోకి తెచ్చుకోవడంలో రష్యాదళాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్ నేలపై ఉన్న రష్యా దళాలను గగనతలం నుంచి రష్యా రక్షించుకోలేక పోయింది. ఫలితంగా రష్యాదళాలు ముందుకు సాగలేక పోవడంతో రష్యాకు భారీ నష్టం కలిగింది. ఉక్రెయిన్ లోని డినిప్రో నగరం దక్షిణ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు ఎస్ 300 వైమానిక రక్షణ క్షిపణి లాంచర్లను నాశనం చేయడానికి తమ సైన్యం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగొర్ కొనషింకొవ్ చెప్పారు.

ఆదివారం నాటి దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన 25 దళాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఐరోపా దేశం నుంచి (ఆ దేశం పేరేమిటో చెప్పలేదు) వైమానిక రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ పొందిందని చెప్పారు. అయితే గతవారం స్లొవాకియా దేశం తాము సోవియట్ డిజైన్‌తో ఉన్న ఎస్300 క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించామని ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. అయితే తాము ఉక్రెయిన్‌కు పంపిన వైమానిక రక్షణవ్యవస్థలు దాడికి గురయ్యాయనడానికి సాక్షాధారాలు లేవని స్లొవాకియా దేశం వ్యాఖ్యానించింది. రష్యా దళాలు ఉక్రెయిన్ లోని నగరాలపై బాంబు దాడులు కొనసాగించడం లోనే నిమగ్నం కావడంతో ఆ దళాలు ముందుకు సాగడంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఉక్రెయిన్ లోని అర్బన్ ఏరియాలన్నీ నేలమట్టమై వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినా , కీవ్ బయట మారణకాండ సాగినా , ఆస్పత్రులపై వైమానిక దాడులు జరిగినా, క్షిపణి దాడికి రైల్వేస్టేషన్‌లో 57 మంది ప్రాణాలు కోల్పోయినా రష్యా రణదాహం ఆరడం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ లోని తూర్పు డొనబాస్ రీజియన్‌పై కొత్తగా దాడి ప్రారంభించడానికి సిద్ధమౌతోంది. ఆ రీజియన్‌లో 2014 నుంచి రష్యా మద్దతు వేర్పాటు దళాలు ఉక్రెయిన్ దళాలతో పోరాటం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఇరువైపులా విధ్వంసానికి వ్యూహాలు రూపొందుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News