Thursday, April 18, 2024

నాటో ఆయుధాలపై రష్యా మరింత గురి

- Advertisement -
- Advertisement -

Russia targets ammunition depot in western Ukraine

లివివ్ ఆయుధడిపోపై భీకర క్షిపణి దాడులు

కీవ్ : ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంపై దాడులను ఉధృతం చేస్తూ రష్యా సైనిక బలగాలు అక్కడి ఆయుధ గిడ్డంగిపై దాడులకు దిగాయి. ఇక్కడి లివివ్‌లో నాటో నుంచి అందిన ఆయుధాలు భారీగా నిల్వ చేసిఉంచారనే సమాచారం అందడంతో రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ డిపోను లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగించి ధ్వంసం చేశాయి. రష్యా బలగాలు ఎక్కువగా ఉక్రెయిన్‌లోని రసాయనిక ఫ్యాక్టరీలు, ఆయుధాగారాలను లక్షంగా ఎంచుకుని వాటిని దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ సైనిక దళాల ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా , ఆయా ప్రాంతాలలో ప్రధాన వనరులకు గండికొడుతూ ఉన్నాయి. మరో వైపు రసాయనికాలు వెలువడేలా చేయడం ద్వారా ఆయా ప్రాంతాలలో క్రమేపీ పర్యావరణం దెబ్బతినడం, భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లేలా చేయడం వంటి సుదీర్ఘ నష్టాలకు వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే లివివ్‌లోని సైనిక ఆయుధ స్థావరాన్ని దెబ్బతీశాయని నిర్థారణ అయింది. ఓ వైపు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని దాదాపుగా రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుందనే విషయాన్ని ఇప్పటికే ఉక్రెయిన్ అధికారికంగా నిర్థారించింది. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రధానమైన అజోట్ కెమికల్ ప్లాంట్‌పై ఇటీవలే దాడులకు దిగారు.

ఈ కర్మాగారం పూర్తిగా విధ్వంసానికి గురైంది. అక్కడ తలదాచుకుని ఉన్న వందలాది పౌరుల అతీగతి ఇప్పటికీ తెలియలేదు. ఇప్పుడు తమ అత్యంత కీలకమైన కలిబ్రి మిస్సైల్స్‌తో జోలోచివ్ పట్టణంలోని ఆయుధాగారాన్ని దెబ్బతీశామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఐగర్ కొనస్చేంకోవ్ తెలిపారు. నాటో సభ్యదేశం పోలెండ్ శివార్లలో ఈ పట్టణం ఉంది. నాటో దేశాలు తమ ఆయుధాలను ఇక్కడి సైనిక గిడ్డంగికి తరలిస్తున్నారనే సమాచారం అందడంతో రష్యా బలగాలు విరుచుకుపడ్డట్లు వెల్లడైంది. రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ దేశానికి మరింత భారీ స్థాయిలో, వ్యూహాత్మక ఆయుధాలను అందించాల్సి ఉందని, లేకపోతే రష్యా కైవసం నుంచి తాము బయటపడే అవకాశాలు ఉండవని నాటో దేశాలకు తరచూ ఉక్రెయిన్ మొరపెట్టుకుంటూ వస్తోంది. ఈ దశలో ఆయా దేశాల నుంచి పోలెండ్ ద్వారా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందుతున్నాయి. వీటిని లక్షంగా ఎంచుకుని రష్యా సైన్యం దాడిని తీవ్రతరం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News