Home అంతర్జాతీయ వార్తలు సిరియాలో వైమానిక దాడి.. 56మంది రెబెల్స్ మృతి

సిరియాలో వైమానిక దాడి.. 56మంది రెబెల్స్ మృతి

బీరుట్: సిరియా వాయువ్య ప్రాంతంలోని తిరుగుబాటుదారుల శిబిరంపై సోమవారం జరిగిన వైమానిక దాడిలో 56 మంది చనిపోయారు. ఈ దాడిలో మరో 50మంది వరకూ గాయపడ్డారని సిరియా అంతర్యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న సిరియన్ ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమెన్ రైట్స్ పేర్కొన్నది. టర్కీ మద్దతుతో పని చేస్తున్న ఫైలాక్ అల్‌షామ్ సంస్థకు చెందిన శిక్షణా శిబిరంపై ఈ దాడి జరిగిందని తెలిపింది. సిరియా ప్రభుత్వ దళాలకు మద్దతు ఇస్తున్న రష్యా ఈ దాడి జరిపినట్టుగా భావిస్తున్నారు.

Russian Airstrikes kill 56 Rebels in Syria