Home జిల్లాలు తుప్పు పట్టిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలి

తుప్పు పట్టిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలి

meetingఘట్‌కేసర్ రూరల్ : గ్రామంలో తుప్పు పట్టిన ఇనుప స్తంబాలను తొలగించి, సిమెంటు విద్యుత్ స్తంబాలను ఏర్పాటు చేయాలని కొండాపూర్ గ్రామస్తులు గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. మండల పరిధిలోని కొండాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ శ్రీహరి అధ్యక్షతన గ్రామస భను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలకు నీళ్ళు పోసిన మహిళకు డబ్బులు చెల్లించాలని గ్రామస్తులు ఆరోపించారు. నీటి సమస్య పరిష్కా రంలో భాగంగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం తెలిపారు. గ్రామంలో నీటి సమస్యల తలెత్తకుండా చేస్తున్నామని గ్రామసభలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిలుకూరి మచ్చేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు ఎస్. కె శౌకత్ మియా, కొంతం లకా్ష్మరెడ్డి, వెంకటేష్, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, ధనలక్ష్మీ, గ్రామ కార్యదర్శి ఉమాదేవి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిలుకూరి గోపాల్‌రెడ్డి, గ్రామస్తులు చిలుకూరి రామలింగారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అవుశాపూర్‌లో : మండలంలోని అవుశాపూర్ గ్రామపంచాయితీ అవరణలో బుధవారం జరిగిన గ్రామసభలో గ్రామస్తులు అధిక సంఖ్యాలో పాల్గోని రహదారి ప్రక్కన ఉన్న భూగర్బ మురుగు కాలువ అవుట్ లెట్ ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెద్దోళ్ళ రమేష్, ఉపసర్పంచ్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొట్టి గోపాల్‌రెడ్డి, గ్రామకార్యదర్శి కవిత, వార్డు సభ్యులు అనసూయ, శంకర్‌గౌడ్, జంగయ్య, ప్రతాప్‌రెడ్డి, నాయకులు రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ డొక్కెని బిక్షపతి గౌడ్, కొండల్ రెడ్డి, రాము, కొట్టి శ్రీకాంత్‌రెడ్డి తదిరుతు పాల్గొన్నారు.