Friday, April 26, 2024

రైతుబంధు నొక్కేస్తున్న రాబందులు

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి జిల్లాలో కోట్లలో ప్రభుతానికి గండి
వ్యవసాయం పేరుతో ప్రభుత్వానికి కుచ్చుటోపీ
క్వారీ భూములు, ఇటుక బట్టీల భూములు,రియల్
భూములకు సైతం రైతుబంధు
తలాపాపం తిలా పిడికెడు అంటున్న
వ్యవసాయ,రెవెన్యూ అధికారులు
ఇటుక బట్ట్టీలలో ఉచిత కరెంటుకు కన్నం
విద్యుత్ అధికారులకు నెలనెల మూమూళ్లు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్లు.. ప్రభుత్వ సొమ్మును రాబందులు కాజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతిగా ఉంటూ, వారికి అన్ని విధాలగా అండగా ఉండేందుకు రైతు బంధు లాంటి ఉత్తమ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతులకు వ్యవసాయం భారం కాకూడదనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5 వేలు చొప్పున రెండు పంటలకు ఏడాదిలో రూ. 10 వేలు నేరుగా రైతుల అకౌంట్లలోకి జ మ చేస్తున్నారు. ఆ ని ధులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే కొ ందరు డ బ్బున్న దొరబాబులు వ్యవసాయం చేయకున్నా చేస్తున్న ట్లు చెప్పి రైతు బంధు డబ్బులను దర్జాగా దిగమింగుతున్నారు.

ఇ ందులో అధికారులకు కాస్తోకూస్తో అందిస్తూ ప్రభుత్వం సొమ్మును అధికారికంగానే జే బుల్లో వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం రైతు బంధు నిధులు కేవలం వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే అందించాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమికాని వాటికి రైతు బందు నిధులు రాకుండా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్తాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇక్కడ అధికారులు వ్యవసాయం చేయని భూములను, రియల్ ఎస్టేట్ భూములను, క్వారీ భూములను, ఇటుకబట్టీలు ఉండే భూములకు సైతం రైతు బందు నిధులు వచ్చేలా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంకు కోట్లలో కుచ్చుటోపి పెడుతున్నారు. మిడ్జిల్ మండలం బైరాన్‌పల్లి,చేదుర్‌గట్ట తండా వద్ద ఉన్న సర్వే నెంబర్ 70,71,72,74,76 లలో దాదాపు 16 ఎకరాల్లో క్రషర్ మిషన్లు ఉ న్నాయి.

ఇటీవలనే ఒక క్వారీలో ఒక కార్మికుడు కూడ మరణించిన సంఘటన తెలిసిందే. సంబందిత యజమానిపై కేసుకూడా నమోదు చేశారు. అయితే ఈ సంఘటనపై పూర్తి విచారణ చేయాల్సిన మైనింగ్ శాఖ అధికారులు అటువైపు రావడానికే జంకుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సర్వే నెంబర్లలో కేసు నమోదు అయిన యజమాని భూమి ఉన్నప్పటికీ ఈ యజమానికి కూడా రైతుబంధు డ బ్బులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఎలాంటి వ్యవసాయ యోగ్యమైన భూమి కానప్పటికీ క్రషర్ మిషన్లు, గుండ్లు, ఇతరత్రా స మాన్లు ఉంచుకున్నారు. ఈ 16 ఎకరాలకు సంబందించిన రైతు బంధు నిధులు అక్రమంగా జేబుల్లోకి వెళ్తున్నాయి. ఈ మండలంలో గతంలోనే అనేక ప్రభుత్వ భూమలు ఉన్నప్పటికీ ఇప్పడు అవి కానరాక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వందల ఎకరాల ప్రభుత్వ గుట్టలు సై తం ఇక్కడ మాయం అయినట్లు తెలుస్తోంది.

రియల్ భూములకు సైతం రైతు బంధు : ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భూం రోజు రోజుకు పెరుగుతోంది. భూములకు డిమాండ్ ఏర్పడింది. ఎకరం భూమి లక్షల్లోనే పలుకు తోంది. దీంతో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారలు నిబంధులను తుంగలో తొక్కి ఎలాంటి డిటిసిపి అనుమతులు లేకుండా దర్జాగా ప్లాట్లు వేసుకొని కోట్ల రూపాయలను అనుభవిస్తున్నారు. అయతే ఇప్పటకి కొందరు రియల్టర్లు ఒక వైపు ప్లాట్లు వేసిన భూములకు సైతం రైతు బంధు నిధులు ఆరగిస్తున్నారు.

జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, మహబూబ్‌నగర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, యర్రవల్లి,అలంపూర్, దేవరకద్ర, మరికల్ వంటి మండలాల్లో రియల్టర్లు రైతు బంధు నిధులను పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్న సమయంలోనే రైతుల నుంచి భూములు కొన్న వారు రెవెన్యూ అధికారుల నుంచి నాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి నాల అనుమతులు లేకుండగానే గ్రామ పంచాయితీ పాత తేదిలు వేసి అనమతి తీసుకున్నట్లు సృష్టించి వెంచర్లు వేస్తున్నారు. సబ్ రిజిష్టర్‌లో కూడా రిజిష్ర్టేషన్లు చేయించుకొని ధరణిలో మార్పులు చేసుకొని రైతు బంధు నిధులు తీసుకుంటున్నారు. అలంపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూముల్లో రైతు బంధు నిధులు గోల్ మాల్ అవుతున్నాయి. అలాగే భూత్పూర్, జడ్చర్లలోని రియల్ భూములకు కూడా రైతు బంధు నిధుల జమ అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇటుక బట్టీల నిర్వహకులకు బంపర్ ఆఫర్ : ఇటుక బట్టీలకు డబుల్ ఆఫర్ అన్నట్లు ఇటు రైతు బంధు, అటు ఉచిత కరెంట్ కూడా అందుతోంది. దీంతో ఇటుక బట్టీల వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున మూడు వైపులా ప్రభుత్వ సొమ్మును ఆరగిస్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మహబూబ్‌నగర్ మండలం, హ న్వాడ, జడ్చర్ల, రాజాపూర్, నారాయణపేట జిల్లాలో మ ఖ్తల్,నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో వందల ఎకరాల్లో ఇ టుక బట్టీలు వెలిశాయి. వీరు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. వీరు ఆ భూములకు రైతు బంధు తీసుకోవడంతో పాటు రైతులకు కల్పించే ఉచిత కరెంట్ కూడా వాడుతూ ప్రభుత్వంకు గండి కొడుతున్నారు. కేవలం బోరు ఉండి వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ప్రభుత్వం ఉచిత కరెంట్‌ను 24 గంటల పాటు అందిస్తోంది. ఇటుక బట్టీలకు కావాల్సిన బోరు నీటికి ఉచిత కరెంట్ మీటర్ ఉండడంతో వేలాది యూనిట్లు కరెంట్ వాడుతూ ప్రభుత్వంకు గండి కొడుతున్నారు.

పేదల ఇళ్లలో ఒక్క రోజు బిల్లు కట్టక పోతే కరెంట్ కట్ చేసే విద్యుత్ అధికారులు ఇటుక బట్టీలలో నిత్యం ప్రతి రోజు కరెంట్‌ను వేలాది యూనిట్లను వాడుతున్నా కంటికి కనిపించడం లేదు. కరెంట్ లోకల్ ఎఇలు, లైన్‌మెన్లకు నెల మామూళ్లు ఉండడంతోనే వాటి జోలికి వెళ్లడం లేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రైతు బంధు నిధులు కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయి.

అధికారులు ఏమి చేస్తున్నట్లు : ఉమ్మడి జిల్లాలో క్షేత్ర స్దాయిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రైతుబంధు నిధులు నిజాయితి గల రైతులకు మాత్రమే అందాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేక పోతున్నారు. స్దానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్లు , ఇతరత్రా వ్యవహారాలతో క్షేత్ర స్దాయిలో ఎలా ఉంటున్నా తమకేమి సంబందం లేదనే తరహాలో వ్యవహరిస్తున్నారు. రైతుబంధును నిబంధనకు విరుద్దంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఇటుక బట్టీలకు ఉచిత కరెంట్ నిలిపి వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News