Monday, July 14, 2025

ఏడు ఎకరాల దాకా రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

వానాకాలం రైతుభరోసా సహాయం కింద ఏడు ఎకరాల వరకు సాగుభూములు ఉన్న రైతాంగానికి శుక్రవారం రూ.905.89 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు వరుసగా ఐదవ రోజున ఏడు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను రైతుల బ్యాకు ఖాతాల్లో జమచేమని, దీంతో 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి గత ఐదు రోజుల్లో రూ.7310.59 కోట్లు విడుదల చేసి 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందించగలిగామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News