Monday, July 14, 2025

మూడెకరాల రైతులకు భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా నిలబడతామన్న సిఎం రేవంత్‌రెడ్డి ఆ మా ట ప్రకారం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యే నా టికి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈ నెల 16 సోమవారం రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వే ల చొప్పున నిధులను ప్రభుత్వం జమ చేసింది.

కాగా మంగళవారం మూడు ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖా తాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.1,551.89 కోట్లను జమ చేసే వి ధంగా నిధులను విడుదల చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. మూడు ఎకరాలు ఉన్న 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్ష ల ఎకరాలకు గాను రైతు భరోసా కిం ద ఈ నిధులను విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన అర్హులై న రైతులందరికి రైతు భరోసా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News