Home తాజా వార్తలు 25 నెలల ‘సాహో’ పూర్తి…

25 నెలల ‘సాహో’ పూర్తి…

 

హైదరాబాద్: యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, రన్ రాజా రన్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న అత్యంత హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. కాగా, సోమవారం ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తికావడంతో ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. జూన్ 9, 2017న సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం.. జూలై 15, 2019న షూటింగ్ ను పూర్తిచేసుకుంది. అంటే సాహో మూవీ పూర్తికాడానికి దాదాపు 25 నెల‌లు ప‌ట్టిందనమాట. షూటింగ్ పూర్తైన నేపథ్యంలో సెట్‌లో ప్ర‌భాస్ కేక్ క‌ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో క‌లిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇక, డ‌బ్బింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్, సీజీ వ‌ర్క్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం ముగించి ఆగ‌స్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాలోని ‘సైకో సయాన్..’ అనే సాంగ్ ను విడుద‌ల చేయ‌గా.. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Saaho film shooting completed