Home తాజా వార్తలు ఆగస్టు 30న ‘సాహో’…

ఆగస్టు 30న ‘సాహో’…

Saaho

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఈ స్టార్ హీరో చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. హై స్టాండర్డ్ విఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా జరుతుండడంతో ముందుగా అనుకున్న ఇండిపెండెన్స్ డే లాంటి మంచి రిలీజ్ డేట్‌ను వదులుకొని ఆగస్టు 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

పూర్తి క్రిస్టల్ క్లారిటీగా రెబల్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్,విక్రమ్‌లు మాట్లాడుతూ “మా బ్యానర్‌లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటీకి కేరాఫ్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ల్యాండ్ మార్క్ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా మేము చేస్తున్న ‘సాహో’ను ఏవిధంగా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. విఎఫ్‌ఎక్స్ కూడా హై రేంజ్‌లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

అందుకే కొంచెం ఆలస్యమైనా బెస్ట్ మూవీని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దీంతో ఆగస్టు 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం”అని అన్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకీ పాండే, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Saaho is released on August 30th