Home Default రెండో రోజూ ‘సాహో’ ప్రభంజనం…

రెండో రోజూ ‘సాహో’ ప్రభంజనం…

 

ప్రస్తుతం ఇంండియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో భాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడదులైన తొలి రోజే నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు క్రిటిక్స్ దారుణమైన రివ్యూస్ ఇచ్చారు. అయినా.. అవేవి తన ప్రభంజనాన్ని ఆపలేవంటూ సాహో దూసుకుపోతోంది. ఎంత నెగిటీవ్ టాక్ స్పెడ్ అయినా… తొలి రోజు ఏకంగా 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది.  ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుందని, సెకండ్ డే ‘సాహో’ ప్రభంజనం చాలా వరకు డ్రాప్ అవుతుందని అందరు అనుకున్నారు.

కానీ, అందరి అంచనాలను తలకిందులు చేసింది సాహో. రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తూ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా హిందీ వెర్షన్లో మొదట రోజు రూ. 24 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘సాహో’… రెండో రోజు ఏకంగా రూ. 26 కోట్ల షేర్‌‌ని రాబట్టింది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్‌లో రెండు రోజులకు కలిపి రూ. 87 కోట్లు రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ సినిమా రూ.205 కోట్లు కొల్లగొట్టినట్టు ‘సాహో’ చిత్ర నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా, ఆదివారంతో పాటు వినాయక చవితి సందర్భంగా సోమవారం కూడా సెలవు రావడంతో ఈ సినిమా మరో రెండు వందల కోట్లను కలెక్ట్ చేసే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా అంత బాగా లేకపోయిన కలెక్షన్స్ మాత్రం దుమ్ముదులుపడంతో ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Saaho movie collected Rs.205 Cr in Worldwide Day 2