Home తాజా వార్తలు ‘సాక్ష్యం’ టీజర్.. సింప్లీ సూపర్బ్…

‘సాక్ష్యం’ టీజర్.. సింప్లీ సూపర్బ్…

Saakshyam Official Teaser Out Now

హైదరాబాద్: బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే  కథనాయిక. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ  సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ నటిస్తున్నారు. భారీ యాక్ష‌న్ డ్రామాగా మూవీ రూపుదిద్దుకుంటుంది. అంతేగాక ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వర్ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.