Sunday, December 3, 2023

ఆకట్టుకుంటున్న ‘సామి.. నా సామి’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీకి జోడీగా రష్మికా మందాన నటిస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ను విడుదల చేశారు. ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. సామి’ అంటూ ఈ మాస్ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా, దేవీ కంపోజ్ చేసిన ఈ పాటను మౌనికా యాదవ్ ఆలపించింది. కాగా, రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’గా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Saami Saami’ lyrical song released from PUSHPA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News