Thursday, April 25, 2024

సార్క్ విదేశాంగమంత్రుల సమావేశం లేనట్టే!

- Advertisement -
SAARC meeting

- Advertisement -

పాక్ డిమాండ్ కారణంగా విరమణ

న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో ఈ వారం ఐక్యరాజసమితి సాధారణసభ(యుఎన్‌జిఎ) సమావేశంతోపాటుగా దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) విదేశాంగ మంత్రుల సమావేశం కూడా నిర్వహించాలని అనుకున్నారు. కానీ అందులో ఆఫ్ఘనిస్థాన్ కూడా పాల్గొనే అవకాశం కల్పించాలని పాకిస్థాన్ పట్టుపట్టడంతో సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంను విరమించారు. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తాలిబన్ ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించిందని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను సార్క్‌లోని మిగతా సభ్యదేశాలు తిరస్కరించాయి. దీనివల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో తాజాగా తాలిబన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించలేదనిపిస్తోంది. గుర్తింపు కోసం(క్రెడెన్షియల్స్) వారు ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించలేదని కూడా తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News